: పరిటాల రవి హత్యకేసులో నిజానిజాలు చంద్రబాబుకు కూడా తెలుసు: సభలో జగన్
అసెంబ్లీలో ఏం జరుగుతోందో రాష్ట్రం మొత్తం చూస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రారంభమయ్యేటప్పటికే 11 మంది వైసీపీ కార్యకర్తలు చనిపోయారని... అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత మరో ఇద్దరు... ఈ రోజు పొద్దున్న మరొకరు చనిపోయారని... మొత్తం 14 మంది వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తల దాడిలో చనిపోయారని జగన్ పేర్కొన్నారు. చర్చను తప్పుదోవ పట్టించేందుకే పరిటాల రవి హత్యను చర్చలో ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. పరిటాల రవికేసులో కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిందని అన్నారు... ఆ కేసులో దోషులకు ఇప్పటికే శిక్ష పడిందని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య విషయంలో నిజానిజాలు చంద్రబాబు నాయుడికి తెలుసని... అందుకే జేసీ బ్రదర్స్ ను టీడీపీలో చేర్చుకున్నారని జగన్ అన్నారు