: వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై బొండా ఉమ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపిన వైసీపీ
బొండా ఉమ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చనిపోయిన ఓ వ్యక్తి గురించి, ఓ మహనీయుడి గురించి సభలో అనుచితంగా మాట్లాడటం తగదని వైసీపీ నాయకులు స్పీకర్ స్థానంలో మండలి బుద్ధప్రసాద్ తో వాగ్వాదానికి దిగారు. అభ్యంతరకరమైన బొండా ఉమ వ్యాఖ్యలను రికార్డ్ నుంచి తొలగించాలని వారు స్పీకర్ ను కోరారు. ఎటువంటి ఆధారాలు లేకుండా రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు చేయడం తగదని వారు స్పీకర్ కు తెలియచేశారు. బొండా ఉమ వ్యాఖ్యలపై స్పీకర్ పోడియం దగ్గర వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.