: కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్: ప్రత్తిపాటి పుల్లారావు
పశుపోషణ, ఉత్పత్తి విషయంలో దేశంలోని అగ్రగామి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఆవుల పెంపకం విషయంలో దేశంలో 15వ స్థానం, గేదెల విషయంలో 5వ స్థానం, గొర్రెల పెంపకంలో 2వ స్థానం, కోళ్ల పెంపకంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని మంత్రి తెలిపారు. అలాగే విభజన తర్వాత కూడా కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని ఆయన చెప్పారు. మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానం... పాల ఉత్పత్తిలో ఆరో స్థానంలో ఉందని ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు.