: అవును... రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ దే: రఘువీరా రెడ్డి
రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ దేనని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు తాము బాధ్యత వహిస్తామని... అయితే ఈ పాపంలో మిగతా పార్టీలు కూడా భాగస్వామ్యం వహించాయని గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలు విభజనకు ఆమోదం తెలుపుతూ లేఖలు ఇచ్చిన తర్వాతే కేంద్రంలోని యూపీఏ సర్కార్ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగినా... టీడీపీ, బీజేపీ ఎంపీలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. పోలవరం, ప్రత్యేక హోదా, లోటు బడ్జెట్ విషయాలపై కేంద్రం ప్రభుత్వ బడ్జెట్ లో కనీసం ప్రస్తావించలేదని అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పునర్విభజన బిల్లులోని అంశాలను ఎందుకు అమలుచేయడం లేదని ఆయన ప్రశ్నించారు.