: రాజస్థాన్ లో అక్కాచెళ్లెళ్లపై అత్యాచారం
రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు అక్కాచెళ్లెళ్లు అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 16న స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో 20, 18 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరు యువతులపై దాడికి దిగిన ఇద్దరు మృగాళ్లు ఆ తర్వాత వారిని రోడ్డుపైనే పడేసి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు తొలుత నిరాకరించిన స్థానిక పోలీసులు, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. మృగాళ్ల అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించిన తమను గాయాలపాల్జేసిన దుండగులు తమపై దారుణంగా అత్యాచారం చేశారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. పోలీసులు తమకు రక్షణ కల్పించే దాకా తమ గ్రామానికి వెళ్లేది లేదని బార్మర్ లో ఉంటున్న బాధిత యువతులు తెలిపారు.