: శాసనసభ నుంచి జగన్, వైకాపా సభ్యుల వాకౌట్


ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష నాయకుడు జగన్ తో పాటు వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. ప్రశ్నోత్తరాలలో భాగంగా... అంగన్ వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలని, వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. దీనికి అధికారపక్షం అంగన్ వాడీ కార్యకర్తల జీతం పెంపు విషయాన్ని పరిశీలిస్తామని సమాధానం చెప్పింది. అయితే తామడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం సరిగ్గా చెప్పలేదని వైకాపా అధ్యక్షుడు జగన్ తో పాటు ఆ పార్టీ శాసనసభ్యులు వాకౌట్ చేశారు.

  • Loading...

More Telugu News