: ఆ వైద్యుడు... ఎబోలాను గెలిచాడు!


కెంట్ బ్రాంట్లీ అమెరికా వైద్యుడు. ఆఫ్రికాలో ప్రాణాంతక వ్యాధి ఎబోలా బారిన పడ్డ రోగులకు చికిత్స అందించాడు. ఈ క్రమంలో ఆయన కూడా అదే వ్యాధి బారిన పడ్డారు. మృత్యువుకు అతి సమీపంగా వెళ్లారు. అయితే ఈ వ్యాధి బారిన పడ్డవారికి చికిత్స అందించేందుకు ఎంత ధైర్యంతో ముందడుగు వేశారో, అంతే ధైర్యంతో ఏకంగా ఆ వ్యాధినే జయించారు. ప్రపంచాన్నే నివ్వెరపరచారు. ఆఫ్రికాలో చికిత్స అందించేందుకు వెళ్లి, ఎబోలా వ్యాధి బారిన పడిన అతడిని స్వదేశం తీసుకువచ్చి చికిత్స అందించాలన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయంపై 15 రోజుల క్రితం దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆ విమర్శకులే ఒబామా నిర్ణయంతో పాటు బ్రాంట్లీ ధైర్య సాహసాలను కీర్తిస్తున్నారు. ఎబోలా బారిన పడిన బ్రాంట్లీని ఆఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన అమెరికా, అట్లాంటాలో చికిత్స అందించింది. పూర్తి ఆరోగ్యంతో బ్రాంట్లీ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. జ్మాప్ పేరిట కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్స బ్రాంట్లీ ప్రాణాలను కాపాడింది. ఎబోలాను తరిమికొట్టింది. ఇకపై ఎబోలాకు భయపడాల్సిన అవసరం లేదని బ్రాంట్లీతో పాటు జ్మాప్ చికిత్స యావత్తు ప్రపంచానికి ధైర్యం నూరిపోస్తున్నారు.

  • Loading...

More Telugu News