: మోడీ... మాట నిలుపుకున్నారు!


‘‘నాకు ఓటేయండి. మీ ఆశయాలు నెరవేరుస్తా’’ ఇదీ మూడు నెలల క్రితం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు. మోడీ మాటను దేశ ప్రజలు నమ్మారు. ఓట్లేశారు. ఆయనను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. ప్రధానిగా మోడీ అప్పుడే వంద రోజులు పూర్తి చేసుకోవడానికి సమయం దగ్గర పడుతోంది. మోడీ ప్రకటనను విశ్వసించిన ప్రజలకు అనుగుణంగా మోడీ పని చేస్తున్నారా? నిన్నటిదాకా ఇదే ప్రశ్న. మా ఆశయాలకు అనుగుణంగానే మోడీ పనిచేస్తున్నారు. ఈ మాటంటున్నది వేరెవరో కాదు. తమ అమూల్యమైన ఓటుతో మోడీని ప్రధాని పీఠంపై కూర్చుండబెట్టిన సగటు భారత ఓటరే. మోడీ తామనుకుంటున్న తీరు కంటే ఇంకాస్త ఎక్కువగానే పనిచేస్తున్నారని తేల్చి చెబుతున్నారు. ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన సర్వేలో 51 శాతం మంది ఈ మాటే చెప్పారు. మళ్లీ ఓటింగ్ జరిగితే, మోడీ నేతృత్వంలోని బీజేపీకే ఓటేస్తామని ఏకంగా 48 శాతం మంది చెప్పారు. ఈ లెక్కన ఇప్పటికిప్పుడు లోక్ సభకు ఎన్నికలు జరిగితే, నిన్నటి ఎన్నికల్లో గెలుచుకున్న సీట్ల కంటే 32 సీట్లు అదనంగా బీజేపీ చేజిక్కించుకునే అవకాశాలున్నాయని సదరు సర్వే తేల్చిచెప్పింది. ఇక మోడీ కేబినెట్ అద్భుతంగా పనిచేస్తోందని 78 శాతం మంది చెప్పారు.

  • Loading...

More Telugu News