: ఎక్కడికైనా వెళ్లండి... సంపాదించుకుని తిరిగి వచ్చేయండి: వెంకయ్యనాయుడు
'దేశంలోని యువకులు తమ ప్రతిభ నిరూపించుకునేందుకు, మంచి వేతనంతో కూడిన ఉద్యోగం చేసేందుకు ఏ దేశమయినా వెళ్లండి... జ్ఞానం సముపార్జించుకుని... బాగా సంపాదించుకుని తిరిగి స్వదేశానికే వచ్చేయండి' అంటూ కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉపాధికోసం దేశం విడిచివెళ్లినా ఇక్కడికే వచ్చేయాలని సూచించారు. దేశానికి యువత అవసరం చాలా ఉందని ఆయన సూచించారు. 'మాతృభూమికి సేవ చేయాలనుకుంటే ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న యువత ఇప్పటికైనా వచ్చి దేశ సంక్షేమం కోసం పాటుపడాలి' అని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాకు వెళ్లి చూస్తే అక్కడ ఉన్న ప్రతి పది మందిలో సగానికి పైగా మనవారేనని ఆయన తెలిపారు.