: అమిత్ షాతో ఆంధ్రా బీజేపీ నేతల సమావేశం
హైదరాబాదు పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలు సమావేశమయ్యారు. విశాఖ ఎంపీ హరిబాబు, మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, కృష్ణంరాజు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్టంలోని పార్టీ పరిస్థితి గురించి అమిత్ షా ఏపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన ఆంధ్రా నేతలకు సూచించారు.