: ప్లీజ్! నన్ను ఎన్ కౌంటర్ చేయద్దు... చిన్నపిల్లాడిలా ఏడ్చిన కిరాతకుడు!
పోలీసు కానిస్టేబుల్ ఈశ్వర్ ను కాల్చిచంపిన కరుడుగట్టిన నేరస్తుడు, నకిలీ నోట్ల ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ పోలీసులను ప్రాధేయపడ్డాడు. ఎన్ కౌంటర్ చేసేస్తారేమోనని భయంతో చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. తాను తప్పు చేశానని పోలీసులను వేడుకున్నాడు. గత నెలలో హైదరాబాదులోని చందానగర్ లో నకిలీ నోట్ల ముఠా పట్టుబడినప్పుడు పోలీసులపై కత్తులతో దాడి చేసిన ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ మహారాష్ట్రలో పోలీసులకు లొంగిపోయాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన సందర్భంగా ఈ నాటకీయత చోటు చేసుకుంది.