: హైదరాబాదులో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై విశాఖలో వరకట్నం కేసు
హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. విశాఖపట్టణంలోని పోతినమల్లయ్యపాలెం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... అనిల్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదనపు కట్నం కోసం నిత్యం భార్యను వేధిస్తున్నాడు. 25 లక్షల రూపాయల అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానని, లేకపోతే విడాకులివ్వాలని వేధింపులకు దిగుతున్నాడు. భర్త మారతాడని ఎదురు చూసిన దివ్యలక్ష్మి అతను మారకపోవడానికి తోడు వేధింపులు మరింత తీవ్రమవడంతో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, త్వరలోనే దర్యాప్తు ప్రారంభిస్తామని వారు వెల్లడించారు.