: సింగపూర్ విదేశాంగ మంత్రితో సమావేశమైన కేసీఆర్
సింగపూర్ విదేశాంగ మంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. కేసీఆర్ సింగపూర్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అంతకు మునుపు ఆయన తెలంగాణ సాంస్కృతిక సంఘం కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నారైలతో ఆయన సమావేశమయ్యారు. సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలను కలిసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాభివృద్ధిపై చర్చలు జరిపారు.