: ఆ సినిమా విడుదల ఆపండి: బీజేపీ నేతలు


మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ హత్య ఆధారంగా పంజాబీలో నిర్మించిన ‘కౌమ్ కే హీరో’ (జాతి వజ్రాలు) సినిమాపై వివాదం చెలరేగింది. శుక్రవారం విడుదల కావాల్సిన ఆ సినిమాని నిషేధించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పంజాబ్ లో మత సామరస్యం, శాంతి నెలకొల్పాలంటే, విద్వేషాలు రేగకుండా చూడాలంటే తక్షణం ఆ సినిమాను నిషేధించాలని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ, సినిమా అనుమతిని పరిశీలించాలని కేంద్ర సమాచార శాఖను ఆదేశించింది. ఈ సినిమా విడుదలైతే మత విద్వేషాలు చెలరేగుతాయని పంజాబ్ లోని పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News