: వేతనాలు పెంచాలంటూ ఏపీ సినీ కార్మికుల డిమాండ్


వేతనాలు పెంచాలంటూ ఏపీ సినీ కార్మికులు హైదరాబాదులో ఆందోళన చేస్తున్నారు. తమ ఒప్పందం ముగిసి నాలుగు నెలలైనా ఇంకా జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదంటున్నారు. రేపటి నుంచి సమ్మె చేస్తామని గురువారం ఉదయమే నోటీసు ఇచ్చిన ఫిలిం ఫెడరేషన్ లోని 24 విభాగాల యూనియన్ల కార్మికులు ఇప్పుడు నిరసనకు దిగారు. ఈ మేరకు శనివారం నుంచి సినిమా షూటింగులు నిలిపివేస్తామని కార్మికులు ప్రకటన చేశారు. కాగా, అటు నిర్మాతల మండలితో ఫిలిం ఛాంబర్ చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి.

  • Loading...

More Telugu News