: ఐస్ నీళ్లలో తడిసి ముద్దయి క్లింటన్ కు సవాలు విసిరిన బుష్


'ఐస్ బకెట్ ఛాలెంజ్' ప్రపంచ సెలబ్రిటీలను ఊపేస్తున్న వ్యాపకం. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు ఐస్ బకెట్ ఛాలెంజ్ లో తడిసిముద్దవుతున్నారు. ఓ వైరల్ ఫీవర్ లా ఐస్ బకెట్ ఛాలెంజ్ సెలబ్రిటీల్లో పాకిపోయింది. తాజాగా అమెరికా మాజీ ఆధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించారు. నేవి బ్లూ క్రూనెక్ టీషర్టు ధరించిన జూనియర్ బుష్, ఐస్ వాటర్ బకెట్ ను కుమ్మరించుకున్నారు. తరువాత మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు ఐస్ బకెట్ ఛాలెంజ్ విసిరారు. తన కూతురు జెన్నా బుష్ హెగర్ ను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. ఐస్ వాటర్ స్నానం చేసిన బుష్ నిధి కోసం ఓ చెక్ కూడా ఇచ్చారు. లా గ్రెగ్స్ వ్యాధిగ్రస్తుల సహాయం కోసం ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News