: సభకు 'సారీ' చెప్పిన గోవా సీఎం


గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ 'నీగ్రో' అన్న పదం వాడినందుకు గాను అసెంబ్లీకి క్షమాపణ తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల అదుపులో ఉన్న విదేశీయుల వివరాలను సభకు వెల్లడిస్తూ, ఓ 'గుర్తు తెలియని ఆఫ్రికన్ నీగ్రో వ్యక్తిని కలాంగుటే గ్రామం వద్ద అదుపులోకి తీసుకున్నారు' అని పేర్కొన్నారు. దీనిపై విపక్షాలు విమర్శించాయి. 'నీగ్రో' అన్న పదం జాతి వివక్ష కిందికి వస్తుందని పేర్కొన్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దీనిపై స్పందిస్తూ, ఇలాంటి పదాల వాడకంతో విదేశీ యాత్రికులకు ప్రతికూల సందేశాలు వెళతాయని పేర్కొంది. దీనిపై సీఎం పారికర్ వివరణ ఇస్తూ, ఇది పోలీస్ డిపార్ట్ మెంటు తప్పిదమని, ఆ విభాగంలోని ఓ క్లర్కు సదరు ఫైల్లో నీగ్రో అని పేర్కొన్నాడని తెలిపారు. నీగ్రో పేరిట అమెజాన్ ప్రాంతంలో ఓ ఉపనది ఉందని, మరో అర్థంలో చూసుకుంటే జాతి వివక్ష భావం కనిపిస్తుందని వివరించారు. తాను ఆ పదం వాడడం పట్ల ఎవరైనా బాధపడి ఉంటే అందుకు క్షమాపణలు తెలుపుతున్నానని సభాముఖంగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News