: తెలంగాణలోని మూడు జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల మార్పు


తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ మార్చింది. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కె.మల్లేశ్, మెదక్ జిల్లాకు జయప్రకాశ్ రెడ్డి, ఆదిలాబాదుకు బి.దేశ్ పాండేలను నియమించింది. వీరు ముగ్గురూ ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ శాసనమండలి సీఎల్పీ కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యవర్గంలో ఉపనేతలుగా షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాగం రంగారెడ్డి, విప్ గా ప్రభాకర్, కార్యదర్శులుగా ఫారుఖ్ హుస్సేన్, సంతోష్ కుమార్ కొనసాగనున్నారు.

  • Loading...

More Telugu News