: ఎబోలా వ్యాధితో తెలుగు వ్యక్తి మృతి
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా బారిన పడిన ఓ తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కెన్యాలో గజేంద్రరెడ్డి అనే వ్యక్తి ఎబోలా వ్యాధితో మృతి చెందారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిటిపిరాళ్లకు చెందిన గజేంద్ర కెన్యాలో ఉపాధికోసం వెళ్లారు. ఈ నెల 4న తీవ్ర జ్వరంతో అక్కడి ఆగాఖాన్ ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. 14వ తేదీన కోమాలోకి వెళ్లిపోయిన గజేంద్ర 18వ తేదీన మృతి చెందారు. గజేంద్రరెడ్డి భార్య, కుమార్తె బెంగళూరు రావడంతో విషయం వెలుగు చూసింది. కాగా పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియర్రాలియోస్, నైజీరియా దేశాలను ఎబోలా వణికిస్తోంది. దీని ధాటికి ఇప్పటికే 1,229 మంది మరణించినట్టు సమాచారం.