: నేనైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తా: అమీర్ ఖాన్
తన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎవరైనా లంచం అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తెలిపాడు. సెన్సార్ బోర్డు అధికారి రాకేష్ కుమార్ అరెస్టుపై స్పందించిన ఆయన తనను ఇంతవరకు ఎవరూ లంచం అడగలేదని అన్నారు. ‘సత్యమేవ జయతే’ టీవీ ప్రోగ్రాం ద్వారా దేశంలో జరుగుతున్న అకృత్యాలను సమాజానికి తెలిపిన అమీర్, లంచం అనేది దేశంలో పాతుకుపోయిన జాఢ్యమని అభిప్రాయపడ్డారు. అవినీతిని అంతం చేయాలంటే ఓ మనిషి వల్లో, ఓ సినిమా వల్లో అది సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమగ్ర భారత్ ను రూపుదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తుచేశారు.