: ఖురేషీ పిటిషన్ పై స్పందించిన ‘సుప్రీం’
ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గవర్నరు పదవి నుంచి వైదొలగాలన్న కేంద్రం సూచనను సవాలు చేస్తూ ఉత్తరాఖండ్ గవర్నర్ ఖురేషీ దాఖలు చేసిన పిటిషన్ పై ఆరు వారాల్లోగా సమాధానమివ్వాలని ఈ నోటీసులో పేర్కొంది. ఈ పిటిషన్ ను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.