: బీజేపీ పార్లమెంటరీ బోర్డులో వయః పరిమితి నిబంధన!
వయోపరిమితి వంకతో కేంద్ర కేబినెట్ పదవుల నుంచి పార్టీ అగ్రనేతలను పక్కన బెట్టిన బీజేపీ ఇప్పుడు పార్టీ పార్లమెంటరీ బోర్డులో కూడా అదే నియమాన్ని అవలంబించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు కొత్త బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్మాణం త్వరలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డెబ్బై ఐదు సంవత్సరాల కటాఫ్ (అన్ని ఏళ్లు దాటిన) ఫార్ములాను పార్లమెంటరీ బోర్డుకు అన్వయించనుందట. దాంతో, అగ్రనేతలు, పార్టీ అనుభవజ్ఞులు అటల్ బీహారీ వాజ్ పాయ్, ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారు బోర్డు నుంచి బయటకు వచ్చేస్తారని సమాచారం. అయితే, పార్టీకీ మూలపురుషులైన వారిని ఇలా తొలగించడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్లవచ్చని ఆర్ఎస్ఎస్ భావిస్తోందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా వెంటనే పార్టీ ఆఫీస్ బేరర్లను పునర్నిర్మించిన సంగతి తెలిసిందే.