: సల్మాన్ కేసులో మరో ట్విస్ట్


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్. సినిమా కథలా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సల్మాన్ కేసుకు సంబంధించిన డైరీ కనిపించడం లేదని, కొన్ని డాక్యుమెంట్లు పోయాయని ముంబై పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. పోలీసులు ఈ విషయాన్ని తెలియజేసిన అనంతరం కోర్టు తదుపరి చర్యలపై రిపోర్టు ఫైల్ చేయాలని ప్రాసిక్యూషన్ ను ఆదేశించింది. మాజీ విచారణ అధికారి కిషన్ షెంగల్ ను సెప్టెంబరు 12న జరిగే విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. 12 ఏళ్ల క్రితం మీద ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారి పైకి సల్మాన్ కారు దూసుకుపోగా ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News