: రాష్ట్ర అధికారాలను తీసుకోవడం సరికాదని రాజ్ నాథ్ కు చెప్పాం: టీఆర్ఎస్ ఎంపీలు
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో జరిగిన టీఆర్ఎస్ ఎంపీల సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. హైదరాబాదుపై అధికారాలను గవర్నరుకు అప్పగించడంపై ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగింది. అనంతరం టీఆర్ఎస్ ఎంపీ కేకే మీడియాతో సమావేశ వివరాలను పంచుకున్నారు. సెక్షన్-8 కింద రాష్ట్రాల అధికారాలను కేంద్రం తీసుకోవడం సరికాదని హోంమంత్రికి చెప్పామని ఆయన తెలిపారు. గవర్నరుకు ప్రత్యేక అధికారాలు కల్పించడం... రాష్ట్రాల హక్కులను హరించడమేనని కేకే అన్నారు. సమాఖ్య విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని చెప్పారు. భేటీ సందర్భంగా... అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణకు కూడా అధికారాలుంటాయని... రాష్ట్ర అధికారాలను హరించి వేయమని రాజ్ నాథ్ చెప్పినట్టు కేకే వెల్లడించారు.