: ఫోర్బ్స్ జాబితాలో ఐదు భారత సంస్థలు


భారత్ కు చెందిన హిందుస్థాన్ యూనిలీవర్ (14వ స్థానం), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (57వ స్థానం), కనస్ట్రక్షన్ సర్వీసెస్ ఫర్మ్ లార్సన్ అండ్ టూబ్రో (58వ స్థానం), సన్ ఫార్మా ఇండస్ట్రీస్ (65వ స్థానం), బజాజ్ ఆటో (96వ స్థానం) సంస్థలు ఫోర్బ్స్ 'అత్యంత వినూత్న కంపెనీ'ల జాబితాలో నిలిచాయి. ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి, నూతన వృద్ధి ఆలోచనల నేపథ్యంలో ప్రపంచంలోని మొత్తం వంద కంపెనీలను ఫోర్బ్స్ తమ జాబితాలో తీసుకుంది. ఈ మేరకు 'వరల్డ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్' కంపెనీల లిస్ట్ ను తాజాగా విడుదల చేసింది. తొలి స్థానంలో కాలిఫోర్నియాకు చెందిన 'గ్లోబల్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ సేల్స్ ఫోర్స్' వరుసగా నాలుగోసారి నిలిచింది. ఇక భారత్ ఐదు సంస్థలు పలు స్థానాల్గో ఉన్నాయి.

  • Loading...

More Telugu News