: రాజధాని ఎక్కడన్న విషయం కూడా ఇంకా నిర్ణయం కాలేదు: చంద్రబాబు
విభజన వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని... రాజధాని ఎక్కడనే విషయం కూడా ఇంకా నిర్ణయం కాలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. పాత అసెంబ్లీ భవనంలోకి వెళుతుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందని అన్నారు. పార్టీ నేతల కోసం నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది... ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు... రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేద్దామని నేతలకు సూచించారు. జాగ్రత్తగా పనిచేయకపోతే కష్టాలు తప్పవని హెచ్చరించారు. ప్రధాని మోడీ ప్రకటించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. ఏపీని డిజిటల్ రాష్ట్రంగా మారుద్దామని అన్నారు.