: బీచ్ టూరిజం అభివృద్ధి చేయాలి: చంద్రబాబు


పేదరిక నిర్మూలన, ఆర్థిక సమానత్వం దిశగా అడుగులు వేద్దామని టీడీపీ నేతలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఐదేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరవు అనే మాట కూడా వినిపించరాదని అన్నారు. వ్యవసాయరంగ సంస్కరణలతో రైతుల జీవితాలు మారాలని అభిలషించారు. వ్యవసాయంపై 66 శాతం ఆధారపడి ఉంటే... రెవెన్యూ మాత్రం 26 శాతమే వస్తోందని చెప్పారు. ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటమే తమ లక్ష్యమని తెలిపారు. బీజ్ టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం పట్టణ జనాభా 28 శాతంగా ఉందని... దీన్ని 50 శాతానికి తీసుకురావాలని సూచించారు. ఈ రోజు పార్టీ నేతలకు నిర్వహించిన వర్క్ షాపులో ప్రసంగిస్తూ చంద్రబాబు ఈ విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News