: ప్రపంచ విమానయాన సంస్థలకు హమాస్ హెచ్చరిక
ఇజ్రాయెల్-హమాస్ పోరుకు ఇప్పట్లో తెరపడేట్టు కనిపించడంలేదు. తాజాగా, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు విమానాలు నడపరాదని హమాస్ తీవ్రవాద సంస్థ ప్రపంచ విమానయాన సంస్థలను హెచ్చరించింది. తొమ్మిది రోజుల కాల్పుల విరమణ ముగిసిన వెంటనే ఇజ్రాయెల్ జెట్ ఫైటర్లు గాజాపై బాంబుల వర్షం కురిపించగా, ప్రతిగా హమాస్ రాకెట్ దాడులతో హోరెత్తించింది. ఈ నేపథ్యంలోనే హమాస్ తాజా ప్రకటన చేసింది. ఇక్కడి ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి స్పందిస్తూ, గాజాలో శాంతి నెలకొనాలంటే చర్చలే మార్గమని ఇరు వర్గాలకు హితవు పలికింది. ఈ ప్రతిపాదనకు హమాస్ వర్గాలు ససేమిరా అంటున్నాయి. చర్చల కోసం ఈజిప్టు వెళ్ళిన పాలస్తీనా ప్రతినిధి బృందాన్ని వెంటనే తిరిగి వచ్చేయాలని హమాస్ కోరుతోంది.