: కాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ టీడీపీ నేతల వర్క్ షాప్
మరికాసేపట్లో హైదరాబాదులో ఏపీ టీడీపీ నేతల వర్క్ షాప్ ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్ హాజరవుతారు. పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. ప్రభుత్వం, పార్టీ రెండూ సమన్వయంతో పనిచేసేలా ఈ వర్క్ షాప్ లో దిశా నిర్దేశం చేయనున్నారు.