: బీజేపీలో చేరనున్న మాజీ డీజీపీ, వైకాపా నేత దినేశ్ రెడ్డి
ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ, వైకాపా నేత దినేశ్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే దినేశ్ రెడ్డి చేరిక కోసం బీజేపీలో అంతా సిద్ధమైంది. బీజేపీలో దినేశ్ రెడ్డికి జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి వైకాపా తరపున దినేశ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.