: విరాట్ కోహ్లీతో ఉండడానికి అనుష్కశర్మకు ఎవరు అనుమతి ఇచ్చారు


ఇంగ్లండ్ సిరీస్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ వైఫల్యానికి అసలు కారణం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు కానీ... ఇప్పుడు అందరి దృష్టి బాలీవుడ్ భామ అనుష్కశర్మ మీద పడింది. అసలు కోహ్లీతో పాటు అనుష్కశర్మను ఇంగ్లండ్ వెళ్లేందుకు బీసీసీఐ ఎలా అనుమతి ఇచ్చిందన్న చర్చ మొదలైంది. బీసీసీఐ నియమ నిబంధనల ప్రకారం విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు... క్రికెటర్లతో పాటు కేవలం వారి భార్యలకు మాత్రమే అనుమతి ఇస్తారు. పెళ్లికాని క్రికెటర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ ను విదేశీ టూర్లకు తీసుకువెళ్లడం బీసీసీఐ నియమావళికి విరుద్ధం. అయితే కోహ్లీ ఇంగ్లండ్ టూర్ కు తనతో పాటు అనుష్కశర్మను కూడా తీసుకువెళతానంటే... ఏమాత్రం ఆలస్యం లేకుండా... ఆలోచన చేయకుండా బీసీసీఐ వెంటనే అనుమతి ఇచ్చింది. అయితే ఈ తప్పుడు నిర్ణయాన్ని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తీసుకున్నారని బీసీసీఐ అధికారులు అంటున్నారు. పెళ్లికాని విరాట్ కోహ్లీ... తన గర్ల్ ప్రెండ్ అనుష్కశర్మను ఇంగ్లండ్ టూర్ కు తీసుకువెళతానని అడిగితే బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వెంటనే అంగీకరించారని బోర్డు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దీంతోపాటు అనుష్కశర్మ కోహ్లీతో కలిసి టీమిండియా బస చేసే హోటల్ లో ఉండేందుకు అనుమతించాలని సంజయ్ పటేల్ టీం మేనేజ్ మెంట్ ను ఆదేశించారని ఆ ఉన్నతాధికారి వివరించాడు. అనుష్కశర్మతో ప్రేమకలాపాల్లో మునిగిపోవడం వల్లే... కోహ్లీ ఇంగ్లండ్ టూర్ లో రాణించలేకపోతున్నాడని క్రీడా పరిశీలకులతో పాటు అభిమానులు కూడా వాపోతున్నారు. కీలకమైన ఇంగ్లండ్ టూర్ లో కోహ్లీతో పాటు ఉండడానికి అనుష్కశర్మకు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ఏ మాత్రం ఆలోచన లేకుండా ఎలా అనుమతి ఇచ్చారని వారు ఆయనపై మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News