: కపిల్ దేవ్ ఓ అవకాశవాది: హాకీ ఇండియా కార్యదర్శి బాత్రా


ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ పై హాకీ ఇండియా కార్యదర్శి నరేంద్ర బాత్రా మండిపడుతున్నారు. కపిల్ దేవ్ ఓ అవకాశ వాది అని బాత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జున అవార్డుల కమిటీకి సారథ్యం వహించిన కపిల్... అవార్డు ఎంపికలో ఏడు మంది హాకీ ఆటగాళ్లను విస్మరించారని ఆరోపించారు. ఈ ఏడు మంది కూడా అవార్డుకు అర్హులైన వారే అన్నారు. అర్హులను కాకుండా, అనర్హులను అర్జున అవార్డులకు ఎంపిక చేశారని కపిల్ పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ కు ప్రపంచకప్ అందించిన కపిల్ కు ఇది తగదని అన్నారు.

  • Loading...

More Telugu News