: నేడు నగరానికి విచ్చేస్తున్న కాషాయ దళపతి


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ కు చేరుకుని గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతుంది. అనంతరం అమీర్ పేటలోని చెస్ కార్యాలయంలో పార్టీ పధాదికారుల సమావేశంలో పాల్గొంటారు. రేపు (22న) ఉదయం అమిత్ షా కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో జరిగే గ్రామ శాఖ అధ్యక్షుల సమావేశంలో ప్రసంగిస్తారు. వారితో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం శంషాబాద్ చేరుకుని ఢిల్లీ తిరిగి వెళతారు.

  • Loading...

More Telugu News