: 54 లక్షలతో ఉడాయించిన మహిళ
ఇప్పుడు ఉన్నపళంగా ధనవంతులుగా మారిపోయేందుకు కొంతమంది తెగ తాపత్రయపడుతున్నారు. డబ్బుకోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు. మేక వన్నె పులుల్లా... మంచితనం ముసుగులో ఆర్ధిక మోసాలకు తెరతీస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రోజుకో మోసం వెలుగులోకి వస్తోంది. తాజాగా విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో ఓ మహిళ చిట్టీల పేరిట జనానికి కుచ్చుటోపీ పెట్టింది. నసీమా అనే మహిళ అందరితో మంచిగా ఉంటూ, చిట్టీల పేరుతో 54 లక్షల రూపాయలు వసూలు చేసి పరారైంది. దీంతో ఆమె బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆందోళన చేస్తున్నారు.