: వారణాసిలో ప్రధాని పార్లమెంటరీ కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా
ఉత్తరప్రదేశ్, వారణాసిలోని రవీంద్రపురిలో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటరీ కార్యాలయమైన ‘రామ్ భవన్’ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... వారణాసి ఆధ్యాత్మికతను కాపాడుతామని అన్నారు. కాశీ ప్రాచీన ఆధ్యాత్మికతకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, వారణాసిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. గురువారం ఉదయం కాశీ విశ్వనాథునికి పూజలు చేసిన అనంతరం ఆయన హైదరాబాదుకు బయల్దేరి వెళతారు.