: పోలీసులా?... రౌడీలా?...ప్రశ్నిస్తే భర్తనే బాదేస్తారా?


కంచే చేను మేసిన రీతిన... ప్రజల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే జుగుప్స కలిగేలా ప్రవర్తించారు. ఇదేంటని ప్రశ్నించిన భర్తను చావబాదారు. ఎదురు తిరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వివరాల్లోకెళ్తే... గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకున్న ఆమె భర్తపై మరో పది మంది పోలీసులతో దాడి చేయించాడు. జరిగిన దారుణంపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా సీఐ కేసు నమోదు చేయలేదు సరికదా, బాధితుల మీదే ఎదురు కేసు పెడతానంటూ బెదిరించాడు. ప్రజల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే ఎవరు రక్షణ కల్పిస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News