: టీఆర్ఎస్ తీరే మాకు వరం: గీతారెడ్డి


అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే తమకు లాభిస్తుందని మాజీ మంత్రి గీతారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, మెదక్ లోక్ సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి పేరు రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని అన్నారు. మెదక్ స్థానానికి పోటీ చేసేందుకు పలువురు సీనియర్ నేతలు ముందుకొస్తున్నారని ఆమె వెల్లడించారు. ఆసక్తి ప్రదర్శిస్తున్న అందరి పేర్లూ ఆధిష్ఠానానికి పంపుతామని, రెండు మూడు రోజుల్లో అధికారికంగా పార్టీ అభ్యర్థి పేరు వెల్లడిస్తుందని గీతారెడ్డి తెలిపారు. అభ్యర్థి ఎవరైనా సమష్టిగా పని చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News