: తెలంగాణలో బీజేపీని బలపరుస్తాం: కిషన్ రెడ్డి
తెలంగాణలో భారతీయ జనతాపార్టీని బలపరుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాదు సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో సుమారు 10 వేల మంది బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని ఆయన తెలిపారు. అమిత్ షాకు గురువారం నాడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలుకుతామని ఆయన తెలిపారు. జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత అమిత్ షా తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.