: కాంగ్రెస్ లో సీనియర్లమే... టీడీపీలో ఓనమాలు నేర్చుకుంటున్నాం: రాయపాటి
కాంగ్రెస్ పార్టీలో తాము సీనియర్లమే కానీ టీడీపీలో జూనియర్లమని, ఆ పార్టీలో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నామని ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. గుంటూరు జిల్లా కాజలో ఆయన మాట్లాడుతూ, టీడీపీలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఒక్కో ఎమ్మెల్యే వద్ద నాలుగైదు గ్రూపులు ఉన్నాయని అన్నారు. ఎన్నికలకు ముందు పార్టీలు వీడి టీడీపీలోకి వచ్చిన నేతలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనలాంటి నేతలంతా ఇబ్బంది పడుతున్నారని రాయపాటి చెప్పారు. గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.