: విమానం ఎగిరిన తరువాత కోపైలట్ మృతి... ప్రయాణికుల ఆందోళన
థాయ్ ఎయిర్ పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిన వెంటనే దారుణం చోటు చేసుకుంది. విమానానికి దిశానిర్దేశం చేయాల్సిన కో-పైలెట్ గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మలేషియా బడ్జెట్ ఎయిర్ లైన్స్ కు సంబంధించిన లయన్ ఎయిర్ ఫ్లైట్ ఎస్ఎల్ 8537 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విమానాన్ని హత్యాత్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం కిందికి దిగగానే కో-పైలట్ కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్ధారించారు. సంఘటన సంభవించినప్పుడు ఈ విమానంలో 152 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నట్టు సమాచారం.