: మళ్లీ కొద్ది సెకన్లలోనే 20 వేల ఫోన్లు అమ్ముడుపోయాయ్!


సియోమి కంపెనీ రూపొందించిన ఎంఐ3 మొబైల్ ఆన్ లైన్ అమ్మకారు జోరు కొనసాగుతోంది. కేవలం ఆన్ లైన్ లో, అది కూడా ఫ్లిప్ కార్ట్.కామ్ లో మాత్రమే లభ్యమయ్యే ఎంఐ3 మొబైల్ ఫోన్లు ఆగస్టు 19వ తేదీన నిర్వహించిన ఆన్ లైన్ అమ్మకాల్లో 20 వేల ఫోన్లు కొద్ది సెకన్ల వ్యవధిలో అమ్ముడుపోయాయి. ఇలా ఆన్ లైన్ లో ఈ మొబైల్ ఫోన్ అమ్మకానికి పెట్టడం ఇది ఐదవసారి. జూలై 22వ తేదీ నుంచి ఐదు దఫాలుగా కొనసాగుతున్న అమ్మకాల్లో ఇప్పటివరకు 70 వేల ఫోన్లు విక్రయించినట్టు నిర్వాహకులు తెలిపారు. తొలి దఫాలో మొబైల్ ఫోన్లను అమ్మకానికి ఉంచిన 40 నిమిషాలకే స్టాక్ ఖాళీ అయిపోయింది. రెండవసారి ఐదు సెకన్లు, మూడోసారి రెండు సెకన్లలోనే అమ్మకాలు పూర్తయిన సంగతి తెలిసిందే. తదుపరి అమ్మకాలను ఈ నెల 26న నిర్వహిస్తామని ప్రకటించారు. 19 నుంచి 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అమ్మకాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.

  • Loading...

More Telugu News