: ఇండిగో విమానం ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు


ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం నుంచి దట్టమైన పొగలు రావడంతో కలకలం రేగింది. ముంబయి నుంచి వచ్చి ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఇండిగో విమానం నుంచి దట్టమైన పొగలు వచ్చాయని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఇండిగో ఎయిర్ లైన్స్ యాజమాన్యం తెలిపింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 147 మంది ఎమర్జెన్సీ డోర్స్ నుంచి క్షేమంగా కిందికి దిగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News