: టీవీఎస్ స్కూటీ జెస్ట్... మార్కెట్లోకి వచ్చిందోచ్
టీవీఎస్ కంపెనీ వారి సరికొత్త స్కూటీ జెస్ట్ మార్కెట్లోకి విడుదలైంది. సరికొత్త ఫీచర్లతో విడుదలైన జెస్ట్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలుస్తుందని సంస్థ పేర్కొంది. ఢిల్లీ షోరూమ్ లో దీని ధర 42,300 రూపాయలు. 110 సీసీ పెట్రోల్ ఇంజిన్, సీటు కింద విశాలమైన స్టోరేజీ స్పేస్, ముందు చక్రానికి 110 ఎం.ఎం, వెనుక చక్రానికి 130 ఎం.ఎం డ్రమ్ బ్రేక్స్ ఉన్న ఈ స్కూటీ జెస్ట్ లీటరు పెట్రోలుకు 62 కిలోమీటర్ల మైలేజినిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... టెస్ట్ రైడ్ కోసం షోరూంకెళ్దాం పదండి.