: నల్లధనం కేసులో సుప్రీంకు సిట్ తొలి నివేదిక
నల్లధనం విషయంలో అక్రమ నిధులపై కనుగొన్న విషయాలు, సిఫార్సులకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) బుధవారం తొలి నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా విదేశీ బ్యాంకుల్లో భారతీయులు నిల్వ ఉంచిన బ్లాక్ మనీని వెనక్కు తీసుకొచ్చేందుకు సిట్ తీసుకుంటున్న చర్యలపై కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. కాగా, ఈ కేసులో మరో రెండు నెలల్లో పురోగతి నివేదిక దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.