: 'ఖాన్' త్రయంపై షార్ట్ ఫిలిం తీస్తాడట!


బాలీవుడ్ ను ఏలుతున్న ఖాన్ త్రయం షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లతో ఓ షార్ట్ ఫిలిం తీస్తానంటున్నాడు యువ హీరో రణబీర్ కపూర్. ఇంతకుముందు తన తాత రాజ్ కపూర్ జీవితంపై లఘు చిత్రం తీయాలని సంకల్పించిన రణబీర్ ఆ ప్రయత్నం విరమించుకున్నట్టు తెలిపాడు. దిగ్గజ నటుడు రాజ్ కపూర్ ది ఓ మహాచరిత్ర అనదగ్గ ప్రస్థానం అని, దానిని సమర్థంగా చెప్పాలంటే ఓ షార్ట్ ఫిలిం సరిపోదని రణ్ బీర్ అభిప్రాయపడ్డాడు. ఆయన గురించి చెప్పాలంటే 500 గంటలు పడుతుందని అన్నాడు. దీంతో, ముగ్గురు ఖాన్ లతో లఘు చిత్రం తీయాలని నిర్ణయించుకున్నానని, తన ఫిలింలో వారు ముగ్గురూ ఓ పాన్పుపై కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉంటారని వివరించాడు.

  • Loading...

More Telugu News