: గాయపడిన యోయో హనీ సింగ్


భారత సంచలన ర్యాప్ స్టార్, పాప్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ ‘యోయో’ (హనీసింగ్) అంటే చాలు చిన్నాపెద్దా తేడా తెలియకుండా ఊగిపోతారు. హనీసింగ్ 'ఇండియాస్ రా స్టార్' అనే టీవీ రియాల్టీ షో షూటింగ్లో ప్రమాదానికి గురయ్యాడు. రియాలిటీ షో షూట్ చేస్తుండగా జారిపడిన యోయో గాయపడ్డాడు. మొదటి ఎపిసోడ్ లో చిట్టచివరి బిట్ షూట్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని షో నిర్మాతలు తెలిపారు. స్వల్పంగా గాయపడిన హనీ సింగ్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని షూటింగ్ కొనసాగించాడని నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. 'ఇండియాస్ రా స్టార్' షోలో పోటీచేసే వాళ్లకు హనీసింగ్ ఓ స్నేహితుడిగా, మెంటార్గా, మార్గదర్శిగా కనిపిస్తాడని వారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వచ్చిన గాయనీ గాయకులు ఈ టైటిల్ కోసం పోటీపడుతున్నారని, ఈ కార్యక్రమానికి హోస్ట్గా ప్రముఖ మోడల్, నటి గౌహర్ ఖాన్ వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. ఆదివారాల్లో ‘స్టార్ ప్లస్’ ఛానల్లో ఈ షో ప్రసారం కానుంది.

  • Loading...

More Telugu News