: ఆయన నన్నెప్పుడూ నవ్విస్తూ ఉంటాడు: రాణిముఖర్జీ


భర్త ఆదిత్యా చోప్రా తనకన్నా మంచివాడని ప్రముఖ బాలీవుడ్ నటి రాణీముఖర్జీ కితాబు ఇచ్చింది. ఆదిత్యాచోప్రా గురించి ఆమె మాట్లాడుతూ, ‘‘ఆయన మంచి సెన్సాఫ్ హ్యూమర్ కలవాడు. నన్నెప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. తనకి భార్యను కావడం నా అదృష్టం’’ అంటూ ప్రేమతో పాటు ప్రశంసల జల్లునూ కురిపించింది. తన వైవాహిక జీవితానికి సంబంధించి విశేషాలను ఓ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది. తన పెళ్లి బెంగాలీ సంప్రదాయంలో జరిగిందని, ఆదిత్యాచోప్రా పంచెకట్టులో బాగున్నాడని చెప్పింది. తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నానని చెప్పింది. ప్రతి ఉదయం కూరగాయలు తేవడం దగ్గర నుంచి కావాల్సినవి వండిపెట్టేంత వరకు అన్నీ తానే చూసుకుంటున్నానని రాణీముఖర్జీ చెప్పింది.

  • Loading...

More Telugu News