: మ్యాచ్ లు గెలిపించేది శాస్త్రికాదు, అది జట్టుకు చెందిన విషయం: కిర్మాణీ


భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ టీమిండియా తాజా వైఫల్యాలపై స్పందించాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు ఓటముల తర్వాత రవిశాస్త్రిని కోచింగ్ డైరక్టర్ గా నియమించడాన్ని స్వాగతించారు. అయితే, మ్యాచ్ లు గెలిపించేది రవిశాస్త్రి కాదని, జట్టు కెప్టెన్, ఆటగాళ్ళ ప్రదర్శనపైనే విజయం ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తమ హయాంలో కోచ్ గానీ, సహాయక సిబ్బంది గానీ ఉండేవారు కారని, అలాంటి పరిస్థితుల్లోనూ 1983 వరల్డ్ కప్ ను నెగ్గామని కిర్మాణీ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఫలితాలకు జట్టు కెప్టెన్, ఆటగాళ్ళదే బాధ్యత అని తెలిపారు. ఆ విధంగా చూస్తే ఇప్పటి టీమిండియా పరాజయాలకు కెప్టెన్, జట్టు సభ్యులను పూర్తి బాధ్యులుగా చేయాల్సి ఉంటుందని అన్నారు. ధోనీ అండ్ కో తాజా ప్రదర్శనపై పోస్ట్ మార్టం నిర్వహించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News