: ఈ సిటీలో ప్రతి ముగ్గురిలో ఒకరు కరోడ్ పతి


మూడు వైపుల ఫ్రాన్స్, మరోవైపు మధ్యధరా సముద్ర తీరం కలిగి ఉండే మొనాకోలో పేదరికం పాళ్ళు చాలా తక్కువ. ఎంతలా అంటే, అక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరు కోటీశ్వరుడట! కోటీశ్వరుల పరంగా అధిక సాంద్రత కలిగి ఉన్న ప్రదేశాల గురించి చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వెల్త్ మేనేజ్ మెంట్ మ్యాగజైన్ 'స్పియర్స్' ఈ అధ్యయనం చేపట్టింది. మొనాకో జనాభాలో 29.21 శాతం కోటీశ్వరులేనని 'స్పియర్స్' పేర్కొంది. కనీసం రూ.6 కోట్లు, ఆపైన నెట్ వర్త్ కలిగిన వ్యక్తులను ఈ అధ్యయనానికి పరిగణనలోకి తీసుకున్నారు. కాగా, ఈ జాబితాలో టాప్-10ను పరిశీలిస్తే మొనాకో తర్వాతి స్థానాల్లో స్విస్ నగరాలు జ్యూరిచ్ (27.34), జెనీవా (17.92)లతో పాటు న్యూయార్క్ (4.63), ఫ్రాంక్ ఫర్ట్ (3.88), లండన్ (3.39), ఓస్లో (2.90), సింగపూర్ (2.80), ఆమ్ స్టర్ డామ్ (2.63), ఫ్లోరెన్స్ (2.59) ఉన్నాయి.

  • Loading...

More Telugu News