: సెప్టెంబరు 10వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సెప్టెంబరు 10వ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబరు 6వ తేదీతో ముగుస్తుండటంతో, 10వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబరు 8న జంటనగరాల్లో వినాయక నిమజ్జనం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబరు 30వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. సమావేశాలను 30వ తేదీతో ముగించాలా, మరికొన్ని రోజులు పొడిగించాలా అన్నది పరిస్థితిని అంచనా వేసి ఖరారు చేయనున్నారు.